సమ‍్మర్‌ రష్‌: కన్జ్యూమర్‌ ఉత్పత్తుల తయారీ జోరు 

Consumer companies' production in top gear - Sakshi

పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్న సంస్థలు 

ఇప్పటికే విక్రయాల్లో 20 శాతం వృద్ధి  

న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్‌ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్‌ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్‌ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్‌ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్‌ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా.

ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్‌ పీక్స్‌: పలు బ్రాండ్స్‌ స్టెప్స్‌ వైరల్‌, ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా!

వైట్‌గూడ్స్‌ తయారీ సంస్థలు ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్‌ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్‌కు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు, బీర్‌ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి.  ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలిపారు.   (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top