‘నాటు నాటు’ జోష్‌ పీక్స్‌: పలు బ్రాండ్స్‌ స్టెప్స్‌ వైరల్‌, ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా!

RRR Naatu Naatu song popular Brands join bandwagon - Sakshi

‘నాటు నాటు’ తెలుగు పాటకు ఇప్పుడు దిగ్గజ కంపెనీలు ఆడిపాడుతున్నాయి. భారత్‌ నుంచి ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతోపాటు, ‘ది ఎలిఫెంట్‌ విష్ఫరర్స్‌’ చిత్రాల వెంట దిగ్గజ బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. 95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డుల్లో రెండు భారత్‌ను వరించడం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో యూజర్లను చేరుకునేందుకు కంపెనీలు ఇప్పుడు అవార్డు పొందిన చిత్రాల ఆధారంగా ప్రచార ప్రకటనలు రూపొందించుకుంటున్నాయి.

జొమాటో, స్విగ్గీ, డంజో, మీషో, కేఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, రెకిట్‌ బెంకిసర్‌కు చెందిన కండోమ్‌ బ్రాండ్‌ డ్యూరెక్స్, గ్లూకోజ్‌ డ్రింక్‌ గ్లూకాన్‌ డీ, మథర్‌ డెయిరీ, పీఅండ్‌జీకి చెందిన టైడ్‌ డిటర్జెంట్‌ ఇప్పటికే వీటి ఆధారంగా ప్రకటనలు, మీమ్స్‌ను రూపొందించాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు, ది ఎలిఫెంట్‌ విష్ఫరర్స్‌ సినిమాలను తమ బ్రాండ్ల సందేశాల్లో చూపిస్తున్నాయి. (‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్‌ ఫీట్‌తో గూగుల్‌ సెర్చ్‌లో జూమ్‌)

వృద్ధికి ఎన్నో మార్గాలు..  
స్విగ్గీ బైక్‌ ఐకాన్‌ను తీసివేసింది. దీని స్థానంలో ఏనుగును (ఎలిఫెంట్‌ విష్ఫరర్స్‌)ను ప్రవేశపెట్టింది. పేటీఎం అయితే.. ‘సే నా టో యూపీఐ ఫెయిల్యూర్స్‌ విత్‌ పేటీఎం’ అంటూ ప్రకటన రూపొందించింది. అంటే లావాదేవీల వైఫల్యానికి నో చెప్పండనే సందేశాన్ని నా టో అని గుర్తు చేసింది. ‘గెలుపొందిన అరుపుల గుసగుసలు. నిజంగా గొప్ప రాత్రి’ అని కండోమ్‌ బ్రాండ్‌ డ్యూరెక్స్‌ ప్రకటన విడుదల చేసింది. డంజో మార్కెటింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌ మేనేజర్‌ తన్వీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆస్కార్‌ కార్యక్రమం సందర్భానుసారం వచ్చే మార్కెట్‌ అవకాశాల కంటే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఇటువంటి తరుణంలో దేశాన్ని గర్వపడేలా చేసిన వారి గురించి సంబరాలు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.

ఇన్‌స్టంట్‌ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ అయిన డంజో 3డీ వెర్షన్‌తో ప్రత్యేకమైన హూక్‌ సెŠట్ప్‌ వెర్షన్‌ను రూపొందించింది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటలో హూక్‌ స్టెప్స్‌ చూసే ఉంటారు. వీటిని తన మస్కట్‌ హర్రితో చేయించి విడుదల చేసింది. కేఎఫ్‌సీ సైతం చికెన్‌ డిన్నర్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ జోడిస్తూ పోస్ట్‌ పెట్టింది. ఇది కేఎఫ్‌సీ ప్రియులతో పాటు, సినీ అభిమానులను చేరుకునే విధంగా ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top