Jr NTR: ఆస్కార్‌ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్‌, తారక్‌ డాన్స్‌? ఎన్టీఆర్‌ క్లారిటీ

Jr NTR Clarifies on Naatu Naatu Performance on Oscar Stage With Ram Charan - Sakshi

అకాడమీ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్‌ సాంగ్‌ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ వస్తుందా? లేదా? అనేది ఒక్క రోజులో తేలనుంది. మార్చి 12న అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. దీంతో అందరి చూపు ఆర్‌ఆర్‌ఆర్‌పైనే ఉంది. అంతేకాదు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు సాంగ్‌ పర్ఫామెన్స్‌ కూడా ఉండనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి

కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, కీరవాణిలు స్టేజ్‌ఈ పాట పాడుతుండగా.. తారక్‌, చరణ్‌లు కాలు కదపనున్నారని సమాచారం. తాజాగా దీనిపై ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చాడు. ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాస్ ఏంజిల్స్‌కు చెందిన KTLA ఛానల్‌తో తారక్‌ ముచ్చటించాడు.

చదవండి: శ్రీవారి సేవలో దిల్‌ రాజు ఫ్యామిలీ.. వారసుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో..

ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డు వేదికపై నాటు నాటు పాట పర్ఫామెన్స్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్‌పై పూర్తి ఇండియన్‌గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్‌కు పర్ఫామెన్స్‌ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌లు స్టేజ్‌పై నాటు నాటు పాటను పాడనున్నారని స్పష్టం చేశాడు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గొల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతో పాటు హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ వంటి అవార్డులను గెలుచుకుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top