Producer Dil Raju Visits Tirumala Tirupati With Son And Wife Tejaswini - Sakshi
Sakshi News home page

Dil Raju: దిల్‌ రాజు కొడుకుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో!

Mar 10 2023 4:38 PM | Updated on Mar 10 2023 5:17 PM

Producer Dil Raju Visits Tirumala Tirupati With Son And Wife Tejaswini - Sakshi

నిర్మాత దిల్‌ రాజు కుటుంబ సమేతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం దిల్‌ రాజు శ్రీవారి సేవలలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని తనయుడికి తలనీలాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దిల్‌ దంపతులను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. భార్య, కుమారుడితో కలిసి ఆలయం బయటకు వస్తున్న దిల్‌ రాజు ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో దిల్‌ రాజు వారసుడు అన్వై రెడ్డి ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. అన్వై రెడ్డి క్యూట్‌ క్యూట్‌ లుక్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో దిల్‌ రాజు తనయుడి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దర్శనం అనంతరం దిల్‌ రాజు మీడియాతో మాట్లాడారు. బలగం మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. ‘గతవారం విడుదలైన బలగం సినిమా ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు మా చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. బలగం మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని దిల్ రాజు తెలిపారు. 

చదవండి: 
నరేశ్‌-పవిత్ర పెళ్లిలో షాకింగ్‌ ట్విస్ట్‌.. ‘రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు’
ఆర్‌ఆర్‌ఆర్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement