K Raghavendra Rao Fires On Tammareddy Bharadwaja Over Comments On RRR Movie - Sakshi
Sakshi News home page

Tammareddy Bharadwaja: ఆర్‌ఆర్‌ఆర్‌ వివాదం: తమ్మారెడ్డిపై నెటిజన్లు ఫైర్‌!

Mar 10 2023 10:27 AM | Updated on Mar 10 2023 11:04 AM

K Raghavendra Rao Fires On Tammareddy Bharadwaja Over Comments On RRR Movie - Sakshi

టాలీవుడ్‌ సంచలనం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై సీనియర్‌ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం ఇండిస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్‌ అవార్డు కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్‌ సినీ దిగ్గజాలు, సినీ ప్రియులు అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: జేమ్స్ కెమెరూన్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా? లెక్కలున్నాయా?: కె. రాఘవేంద్రరావు సూటి ప్రశ్న

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మిత్రుడు భరద్వాజ్కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి కానీ, రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్‌ చేశారు. 

ఇక దర్శకేంద్రుడి మద్దతుగా నెటిజన్లు, ఆరఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే తిరుగుతారు. 80 కోట్ల రూపాయలు ఉంటే పది సినిమాలు తీస్తారు సరే.. అందులో ఒకటైన ఆస్కార్‌కు వెళుతుందనే గ్యారంటీ ఇస్తారా? భరద్వాజ గారు’ అంటూ ఓ నెటిజన్‌ ఆయనకు కౌంటర్‌ ఇచ్చాడు. అలాగే మరో నెటిజన్‌ స్పందిస్తూ ‘విచిత్రమైన మనిషి, విచిత్రమైన కామెంట్స్‌’ అసహనం వ్యక్తి చేశాడు. 

చదవండి: ఆస్కార్‌ కోసం 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫ్లైట్‌ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి

కాగా రీసెంట్‌గా రవింద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అంటూ షాకింగ్‌ కామెం‍ట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement