అంతర్జాతీయంగా పసిడి పరుగు

Commodity Market: Gold price Hikes again - Sakshi

35 డాలర్లు అప్‌

వాషింగ్టన్‌: ఆర్థిక అనిశ్చితి ధోరణుల్లో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర గురువారం 35 డాలర్లకుపైగా పెరిగి 1,752 డాలర్లపైన ట్రేడవుతోంది (రాత్రి 11 గంటల సమయంలో).

అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం పరిస్థితుల్లో ఇకముందు ఫెడ్‌ ఫండ్‌ రేటు మరింత దూకుడుగా ఉండబోదన్న అంచనాలు, 20 సంవత్సరాల గరిష్టం 109 నుంచి వెనక్కు తగ్గిన డాలర్‌ ఇండెక్స్‌ (ఈ వార్త రాస్తున్న సమయంలో 106.4 వద్ద ట్రేడింగ్‌) వంటి కీలక అంశాలు దీనికి నేపథ్యం. ఇక అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా ముంబై ప్రధాన బులియన్‌ మార్కెట్‌లో ధర రూ.500 వరకూ లాభపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top