CNG వాహనదారులకు షాక్.. కిలోకు రూ.3.89 పెంపు! | CNG To Get Costlier By Rs 3 89 Says IGL | Sakshi
Sakshi News home page

CNG వాహనదారులకు షాక్.. కిలోకు రూ.3.89 పెంపు!

Aug 29 2026 12:04 AM | Updated on Aug 29 2026 12:12 AM

CNG To Get Costlier By Rs 3 89 Says IGL

ఆటోలు, క్యాబ్‌లు, అలాగే తక్కువ ఖర్చుతో వ్యక్తిగత వాహనాలు నడిపే వారికి మరోసారి భారం పెరగనుంది. ఎందుకంటే.. ఆగస్టు 29 నుంచి సీఎన్‌జీ ధర కిలోకు రూ.3.89 పెరగనుంది. శుక్రవారం రాత్రి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.86.98కు చేరనుంది. కొత్త ధరలు ఆగస్టు 29 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.

ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ ధరలు పెరగడమే అని ఐజీఎల్ స్పష్టం చేసింది. గ్యాస్‌ కొనుగోలు ఖర్చు పెరుగుతుండటంతో.. దాని ప్రభావం సంస్థపై పడుతోందని.. ఈ అదనపు ఖర్చును కొంతవరకు భర్తీ చేసుకునేందుకు కిలోకు రూ.3.89 మేర ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది.

సీఎన్‌జీ ధర పెరగడంతో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ సర్వీస్‌ నిర్వాహకులు, రోజువారీ ప్రయాణాలకు సీఎన్‌జీ వాహనాలను ఉపయోగించే వారికి ఖర్చు పెరగనుంది. ఇంధన ధరల పెంపు రవాణా ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే సీఎన్‌జీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా.. నిరంతరంగా సరఫరా కొనసాగుతుందని ఐజీఎల్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement