గుడ్‌న్యూస్‌: ప్రముఖ ఐటీ కంపెనీలో కొలువుల జాతర

Capgemini to hire 30,000 people in India   - Sakshi

క్యాప్ జెమినిలో 30వేల ఉద్యోగాలు

సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు  క్యాప్‌ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్‌ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్‌-19 నేపథ్యంలో డిజిటల్‌ సొల్యూషన్‌కు  పెరిగి  భారీ డిమాండ్‌  తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు.  

డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్‌ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా  క్లౌడ్‌ బిజినెస్‌, డిజిటల్  సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం. కరోనానుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారి తిరిగి పుంజుకుంటుందని,  భారీ డీల్స్‌ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఏప్రిల్ 2020 లో, మహమ్మారి  పీక్‌ సమయంలో కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్నగత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి. ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమింకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని ఆశిస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top