ఏఐతో బోధనకు శ్రీకారం చుట్టిన బైజూస్‌

Byjus inducts generative ai for guiding students details - Sakshi

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ తమ లెర్నింగ్‌ మాడ్యూల్స్‌లో జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేథ – జెన్‌ఏఐ)ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. విద్యార్థులు ఆకళింపు చేసుకునే విధానాలను అర్థం చేసుకుని, తదనుగుణంగా బోధనా విధానాలను రూపొందించేందుకు విజ్‌ సూట్‌ కింద బీఏడీఆర్‌ఐ, మ్యాథ్‌ జీపీటీ, టీచర్‌జీపీటీ పేరిట మూడు ఏఐ మోడల్స్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించింది. అయితే, వీటితో టీచర్ల స్థానాన్ని భర్తీ చేసే ఉద్దేశమేమీ లేదని బైజూస్‌ సహ వ్యవస్థాపకురాలు దివ్యా గోకుల్‌నాథ్‌ తెలిపారు. 

సంస్థను సమర్ధమంతంగా తీర్చిదిద్దుకునేందుకు, అలాగే ఉపాధ్యాయులు మరింత ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఏఐని ఉపయోగించుకోనున్నట్లు వివరించారు. ఏఐ మాడ్యూల్‌తో కంపెనీ వ్యవస్థ పటిష్టమవుతుందని, ఆదాయం.. మార్జిన్లపై సానుకూల ప్రభావాలు చూపగలదని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top