బిజినెస్ లీడర్ 'అట్లూరి'కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు | Business Leader Sri Atluri Honored Lifetime Achievement Award - Sakshi
Sakshi News home page

బిజినెస్ లీడర్ 'అట్లూరి'కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

Aug 24 2023 5:50 PM | Updated on Aug 24 2023 5:58 PM

Business Leader Atluri got Lifetime Achievement Award - Sakshi

అమెరికాలోని భారతీయ తెలుగు కమ్యూనిటీ వ్యాపార ప్రముఖులలో ఒకరైన 'అట్లూరి'కి ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 (ఐఎస్ఎఫ్ 2023) ఈవెంట్‌లో 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' లభించింది.

దశాబ్దాలుగా వ్యాపార ఆలోచనలతో అనేక ఔత్సాహిక స్టార్టప్ ఆలోచనలకు వేదికగా పనిచేసిన CXO ఫోరమ్ రూపశిల్పిగా ఉన్నందుకు ఈ అవార్డును అందుకున్నట్లు సమాచారం. స్టార్టప్‌లలో చాలా మంది ఒకే విధమైన ఆలోచనను కలిగి ఉంటారు. కానీ కొత్త సాంకేతికతలు, మార్కెట్ పోకడలను అవలంబించడం ద్వారా వారు అభివృద్ధి చెందాలని అట్లూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో శివకుమార్ సూరంపూడి (ఐటీసీ లిమిటెడ్‌లోని అగ్రి & ఐటీ బిజినెస్‌ గ్రూప్ హెడ్), డా.డి నాగేశ్వర్ రెడ్డి (ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ & ఏఐజీ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ & చీఫ్), వినీత్ రాయ్ (ఆవిష్కార్ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్) డా.గల్లా రామచంద్ర నాయుడు (అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్), డా.పి రాజ మోహన్ రావు (యునైటెడ్ టెలికామ్స్ గ్రూప్ చైర్మన్) మొదలైన వారికి కూడా అవార్డులు అందించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement