రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్‌? | Sakshi
Sakshi News home page

రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం:దాని స్థానంలో భారీ టవర్‌?

Published Wed, Sep 20 2023 8:17 PM

BTown Hero DevAnand Bungalow Sold For Rs 400 Crores Ketan Anand denies - Sakshi

బాలీవుడ్‌ అలనాటి మేటి హీరో, దివంగత దేవానంద్‌కుచెందిన లగ్జరీ బంగ్లాను విక్రయించినట్టు మీడియాలో వార్తలుగుప్పుమన్నాయి.  దేవానంద్ డ్రీమ్‌ హౌస్‌ ముంబైలోని జుహూ బంగ్లాని ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి భారీ మొత్తానికి రూ .400 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. దాని స్థానంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించబడుతుందనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. 

ఈ రూమర్లపై దేవానంద్ మేనల్లుడు,నిర్మాత కేతన్ ఆనంద్ తాజాగా స్పందించారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని, అవన్నీ తప్పుడు వార్తలని ఆయన ఖండించారు. దీనికి సంబంధించి దేవానంద్‌ కుమార్తె దేవీనా, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధృవీకరించుకున్నట్టు వెల్లడించారు. దాదాపు 40ఏళ్లపాటు దేవానంద్‌ తన భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ , దేవినా ఆనంద్‌లతో కలిసి గడిపారు. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్‌ 15 దక్కించుకునే చాన్స్‌)

అలాంటి ఇల్లును విక్రయించారని, డీల్‌ కూడా పూర్తయి పేపర్‌ వర్క్‌ జరుగుతోందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ బంగ్లాను చూసుకోడానికి ఎవరూ లేని కారణంగా ముఖ్యంగా కొడుకు సునీల్ అమెరికాలోనూ, కూతురు దేవినా, తల్లి కల్పనాతో కలిసి ఊటీలో ఉంటోంది. అందుకే దీన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అదే కారణంతో మహారాష్ట్రలోని పన్వెల్‌లో కొంత ఆస్తిని కూడా విక్రయించారని కథనాలొచ్చాయి. (వాట్సాప్‌ చానెల్‌: ప్రధాని మోదీ రికార్డ్‌..షాకింగ్‌ ఫాలోవర్లు)

ఈ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీల బంగ్లాలు ఉన్న ప్రధాన ప్రదేశం కాబట్టి  అంత దర పలికిందనీ, ఈప్లేస్‌లో 22 అంతస్తుల భారీ టవర్‌ను నిర్మించనున్నారని కూడా అంచనావేశారు. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం ఆనంద్ స్టూడియో అమ్మినప్పుడు, ఆ డబ్బుతో మూడు అపార్ట్‌మెంట్లు కొని, ఒకటి సునీల్‌కు, మరొకటి దేవీనాక, మూడోది అతని భార్య కల్పనకు ఇచ్చారనీ జుహు బిల్డింగ్‌ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును కూడా అలాగే పంచుకుంటారనేది కథనం. 
 

 
Advertisement
 
Advertisement