మార్కెట్లకు సైబర్‌ దాడి ముప్పు  | BSE asks trading members to take measures to ward off any cyber threat | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు సైబర్‌ దాడి ముప్పు 

May 9 2025 1:40 AM | Updated on May 9 2025 7:44 AM

BSE asks trading members to take measures to ward off any cyber threat

అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లు, బ్రోకర్లకు బీఎస్‌ఈ హెచ్చరిక 

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లకు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని మార్కెట్‌ వర్గాలను స్టాక్‌ ఎక్సే్చంజీ బీఎస్‌ఈ హెచ్చరించింది. రిస్క్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది.  

రిస్క్ లను మదింపు చేసుకుని, నివారణ చర్యలు తీసుకోవాలని, సిస్టంల భద్రతకు సంబంధించి పర్యవేక్షణను పటిష్టపర్చుకోవాలని, దాడులు జరిగిన పక్షంలో సత్వరం స్పందించేలా తగు ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సైన్యం క్షిపణి దాడులతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement