Boat Xtend Talk Smartwatch Launched In India: Check Price And Special Features - Sakshi
Sakshi News home page

Boat Xtend Talk Smartwatch: అదిరిపోయే ఫీచర్లతో.. 'బోట్' స్మార్ట్‌ వాచ్‌ విడుదల, ధర ఇంత తక్కువా!

Aug 26 2022 4:25 PM | Updated on Aug 26 2022 5:22 PM

Boat Xtend Talk Smartwatch Launched In India - Sakshi

తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో ప్రముఖ వేరబుల్‌ తయారీ సంస్థ 'బోట్‌ ఎక్స్‌టెండ్‌ టాక్‌' అనే స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేయనుంది. స్మార్ట్‌ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌, అలెక్సా సపోర్ట్‌, ఐపీ 68తో పాటు ఫీచర్లు ఉన్నాయి. 2.5 డీ కర్వ్‌డ్‌ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ.3వేల లోపు ఉండనుంది. 

ఫీచర్లు 
300ఎంఏహెచ్‌ బ్యాటరీ, హెచ్‌డీ రెజెల్యూషన్‌తో 1.69 డిస్‌ప్లేతో డిజైన్‌ చేసింది. బోట్‌ స్మార్ట్‌ వాచ్‌లో హార్ట్‌ రేట్‌ సెన్సార్‌లు, పల్స్‌ రేట్‌ ఎలా ఉందో చెక్‌ చేసే ఆక్సో మీటర్‌ తరహాలో (ఎస్‌పీ ఓ2 మానిటర్‌), ఉదాహరణకు ట్రెడ్‌ మిల్‌ మీద మీరు నడిచే సమయంలో ఎంత గాలి పీలుస్తున్నారు. ఎంత గాలి వదులుతున్నారో గుర్తించండం (వీఓ2 మ్యాక్స్‌), ఎన్ని మెట్లు ఎక్కారో ట్రాక్‌ చేయడం, మీ శరీరంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ మోడ్స్‌ విభాగంలో రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, యోగా, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌ బ్యాడ్మింటన్, స్కిప్పింగ్‌, స్విమ్మింగ్‌ ఎంత సేపు చేశారో ఆటో మెటిగ్గా గుర్తిస్తుంది. 

బ్యాటరీ లైఫ్‌ టైం
ఈ స్మార్ట్‌ వాచ్‌ బ్యాటరీ లైఫ్‌ టైం 10రోజులు ఉంటుందని బోట్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొన్ని సమయాల్లో మాత్రం బ్లూటూత్‌ కాలింగ్‌ ఆప్షన్‌తో 2 రోజుల బ్యాటరీ లైఫ్‌ టైంను వినియోగించుకోవచ్చని తెలిపారు. 

ధర
ఐపీ68 రేటింగ్‌తో వస్తున్న ఈ ఎక్సెటెండ్‌ టాక్‌ స్మార్ట్‌ వాచ్‌లో 150 వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. అంటే వాచ్‌ డిస్‌ప్లే ను మీరు 150 రకాల డిస్‌ప్లే స్టైల్స్‌ను మార్చుకోవచ్చు. ఇక ఈ వాచ్‌ ప్రారంభ ధర రూ.2,999గా ఉంది. అమెజాన్‌లో లభ్యమయ్యే ఈ స్మార్ట్‌ వాచ్‌ పిచ్‌ బ్లాక్‌, చెర్రీ బ‍్లూసోమ్‌, టీమ్‌ గ్రీన్‌ వేరియంట్లలో లభ్యం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement