రియల్‌ ఎస్టేట్‌ రంగంలో బీకే మోడీ వేల కోట్ల పెట్టుబడులు | Bk Modi Group Invest 1 Billion Usd Over Next Five Years In Real Estate | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో బీకే మోడీ వేల కోట్ల పెట్టుబడులు

Published Wed, Jan 4 2023 1:00 PM | Last Updated on Wed, Jan 4 2023 1:00 PM

Bk Modi Group Invest 1 Billion Usd Over Next Five Years In Real Estate - Sakshi

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా రియల్టీ, వెల్‌నెస్‌ విభాగాలలో కార్యకలాపాల విస్తరణపై దృష్టిపెట్టినట్లు బీకే మోడీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. భారీ వృద్ధి అవకాశాలున్న ఈ రెండు రంగాలలో బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 8,250 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. రియల్టీ, వెల్‌నెస్‌ విభాగాలలో కొత్త టెక్నాలజీలకు వీలున్నట్లు గ్రూప్‌ వ్యవస్థాపకులు బీకే మోడీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ప్రతిపాదిత ప్రాజెక్టులలో విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములు చేయనున్నట్లు తెలియజేశారు. ఒక డెవలపర్‌తో కలసి ఇప్పటికే ముంబైలో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బిజినెస్‌ను మరింత విస్తరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.  

మిక్స్‌డ్‌ ప్రాజెక్టుకు రెడీ 
ప్రయివేట్‌ స్మార్ట్‌ సిటీ ఆలోచనపై స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో మిక్స్‌డ్‌ వినియోగానికి వీలైన ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు మోడీ తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement