భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! | Sakshi
Sakshi News home page

భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!

Published Mon, Sep 25 2023 2:56 PM

Benz Lexus Audi Expect Bumper Sales In India festive Season - Sakshi

భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్‌లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు.

 ఇదీ చదవండి: దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా!

2022 పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు..

ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్‌ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్‌లతో ఈవీ పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా.

Advertisement
 
Advertisement