బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధి | Bank Of Maharashtra December 2022 Results Records 22pc Loan Growth | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధి

Jan 4 2023 4:38 PM | Updated on Jan 4 2023 5:08 PM

Bank Of Maharashtra December 2022 Results Records 22pc Loan Growth - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 2022 డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి స్థూల రుణాలు రూ.1.57 లక్షల కోట్లకు ఎగశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21.81 శాతం వృద్ధి అని బ్యాంక్‌ తెలిపింది. డిపాజిట్లు 11.69 శాతం అధికమై రూ.2.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

మొత్తం డిపాజిట్లలో కరెంట్‌ అకౌంట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (సీఏఎస్‌ఏ) 52.50 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌ చివరినాటికి మొత్తం వ్యాపారం 15.83% వృద్ధి చెంది రూ.3.65 లక్షల కోట్లను నమోదు చేసింది.

చదవండి: పేటీఎం యూజర్లకు బంపరాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement