పేటీఎం యూజర్లకు బంపరాఫర్‌

Paytm 14 Percent Discount On Flight Booking - Sakshi

హైదరాబాద్‌: చెల్లింపులు, ఆర్థిక సేవల్లోని ప్రముఖ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) ఫ్లయిట్‌ టికెట్‌ బుకింగ్‌లపై తగ్గింపులను ప్రకటించింది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్‌ బుకింగ్‌లపై, కొత్త కస్టమర్లకే ఈ డిస్కౌంట్‌ ఆఫర్లు పరిమితమని పేటీఎం తెలిపింది. 

విస్తార, స్పైస్‌జెట్, ఎయిరేషియా, గోఫస్ట్, ఇండిగో, ఎయిర్‌ ఇండియా దేశీ సర్వీసులపై ఈ ఆఫర్‌ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. మొదటి ఫ్లయిట్‌ టికెట్‌ బుకింగ్‌పై 14 శాతం తక్షణ డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపింది.

ఈ డిస్కౌంట్‌ గరిష్టంగా రూ.1,000కి పరిమితం అవుతుంది. కనీస ఆర్డర్‌ విలువ వంటి షరతు లేదు. యూజర్లు టికెట్లను రద్దు చేసుకుంటే నూరు శాతం రిఫండ్‌ వచ్చే రక్షణ ఉంటుందని పేటీఎం తెలిపింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top