Bank holidays in April 2023: ఏకంగా అన్ని రోజులు సెలవులా?

Bank holidays in April 202315 days banks will be closed check list - Sakshi

సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్‌లో  ఏకంగా 15 రోజుల పాటు  బ్యాంకు  సెలవులున్నాయి.  రెండో  శనివారం, ఆదివారాలు, సెలవులు, పండగలు కలిసి ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.  దాదాపు నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవు.  అయితే ఆన్‌లైన్‌సేవలు, యూపీఐ  లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదనేది గమనార్హం.

ఇదీ చదవండి: విషాదం: ఇంటెల్‌ కో-ఫౌండర్‌, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత)

ఏప్రిల్ నెలలో సెలవులు  లిస్ట్‌ 
ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న మిజోరం, చండీగఢ్, మేఘాలయ,  హిమాచల్ ప్రదేశ్ మినహా,  బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 2, 9,16,23,30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
ఏప్రిల్ 4 : మహావీర్ జయంతిని పురస్కరించుకుని  వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి 
ఏప్రిల్ 5: బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7:  గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

 (ఇదీ చదవండి:  బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్‌ జుకర్‌బర్గ్)

ఏప్రిల్ 8: రెండో శనివారం, అలాగే 22 నాలుగో శనివారం
ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 15: వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 18: షాబ్ ఇ బకర్ కారణంగా జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
ఏప్రిల్ 21:  రంజాన్ ఈద్( ఈద్ ఉల్ ఫితర్‌)  అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top