Bank Deposit Rates: డిపాజిట్‌ రేట్లకు త్వరలో రెక్కలు  

Bank deposit rates set to rise sharply soon: Report - Sakshi

 ఇక్రా రేటింగ్స్‌ అంచనా

ముంబై: రుణాలకు పెరుగుతున్న డిమాండ్, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమం నేపథ్యంలో రానున్న నెలల్లో బ్యాంకులు డిపాజిట్లపై రేట్లను పెంచక తప్పదని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. డిపాజిట్‌ రేట్ల పెరుగుదలకు సంకేతంగా, బ్యాంకులు అధికంగా నిధులు సమీకరించే మార్గమైన సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌ (సీడీలు) రేట్లు క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే కొన్నేళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని ఇక్రా గుర్తు చేసింది.

బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో సీడీలు 2022 జూలై 1 నాటికి 1.5 శాతంగా ఉన్నాయి. అయితే, 2011 జూన్‌ నాటి గరిష్ట స్థాయి 8.3 శాతాన్ని చేరుకోవాల్సి ఉందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. రుణాలకు డిమాండ్‌ పెరుగుతుండడంతో బ్యాంకులు తాజా నిధుల కోసం సీడీలపై ఆధారపడడం పెరుగుతున్నట్టు వివరించింది. ఆర్‌బీఐ ఇప్పటికే రెండు విడతల్లో 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో రుణాలపై, డిపాజిట్లపై తిరిగి రేట్ల పెరుగుదల ఆరంభమైంది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top