
బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినూత్నమైన బీమా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 100 ఏళ్ల వయసు వరకు జీవిత బీమాను తీసుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిలోపు పాలసీదారు మరణించినట్టయితే వారసులకు ఏక మొత్తం బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేకాదు అక్కడినుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని చెల్లిస్తుంటుంది. గడువు తీరిన మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
కనీసం మూడు నెలల వయసు నుంచే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇలా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయసు నుండే తమ పిల్లల కోసం ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీలుంటుంది. విద్య, వివాహం లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు ఈ పాలసీ సహాయపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనువైన చెల్లింపు ఎంపికలతోపాటు మహిళా పాలసీదారులకు అదనపు రాబడిని కూడా అందిస్తుంది.
స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్‌ను రూపొందించారు. కస్టమర్లు తమకు సౌకర్యవంతమైన ఆదాయ చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు లేదా తరువాతి దశలో ఆదాయాన్ని కూడబెట్టి ఉపసంహరించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను నిర్వహించడం, అత్యవసర నిధిని నిర్మించడం లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేయడం, ప్రణాళిక వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.