World First ATM Machine History And Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

ATM History: ఏటీఎం పుట్టుక.. ‘ఎనీ టైం మనీ’ గురించి ఈ వివరాలు మీకు తెలుసా?

Jan 1 2022 4:12 PM | Updated on Jan 1 2022 5:03 PM

ATM History World India First ATM Details Interesting Facts - Sakshi

క్యాష్‌ పెట్టగానే క్యాష్‌ కురిపించే కల్పతరువుగా ఏటీఎం గురించి ఈ ఆసక్తికర విషయాలు మీ కోసం.. 

కొత్త ఏడాదిలో మొదటి రోజునే ఆర్బీఐ ఏటీఎం విత్‌డ్రా కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్‌జాక్షన్స్‌ పరిధి గనుక అయిపోతే.. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బాదేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ విషయం పక్కనపెడితే.. మొట్టమొదటి  ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌ అలియాస్‌ ఏటీఎం Automated teller machine ఎక్కడ నెలకొల్పారో తెలుసా?



►1987లో హెచ్‌ఎస్‌బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. 

►ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. 

►మార్చ్‌ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్‌సైట్‌ ఏటీఎంలు, 97, 970 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉన్నాయి. 

►2021, మార్చ్‌ నెల చివరినాటికి.. మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్‌ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి.

►  ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్‌లు వినిపిస్తుంటాయి. 

► పేటెంట్‌ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి. 

►అయితే బ్రిటన్‌ ఆవిష్కరణకర్త జాన్‌ షెపెర్డ్‌ బారోన్‌ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా కీర్తి గడించారు.

►1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఈయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. 

►1967లో నార్త్‌ లండన్‌లోని ‘బార్‌క్లేస్‌ బ్యాంక్‌’ ఎన్‌ఫీల్డ్‌ టౌన్‌ బ్రాంచ్‌ బయట జూన్‌ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు.

►విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్‌లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. 

►ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్‌బీఐ బ్యాంక్‌ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది.  \

►అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్‌ టెల్లర్‌ మెషిన్‌), కెనడాలో ఆటోమేటెడ్‌ బ్యాంకింగ్‌ మెషిన్‌(ABM), బ్రిటిష్‌ నేలపై క్యాష్‌ పాయింట్‌, క్యాష్‌ మెషిన్‌, హోల్‌ ఇన్‌ ది వాల్‌ అని కూడా పిలుస్తుంటారు. 

►క్యాష్‌లైన్‌, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్‌, క్యాష్‌ డిస్పెన్సర్‌, క్యాష్‌ కార్నర్‌, బ్యాంకోమాట్‌ అని పిలుస్తారు. 

►ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆధీనంలో ఉండని వాటిని వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు అని పిలుస్తారు. 

►2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్‌ వెల్లడించింది. 

►అయితే క్యాష్‌లెస్‌ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది. 

► ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్‌ లోన్‌ మెషిన్‌ అనే డివైజ్‌ జపాన్‌లో ప్రాచుర్యంలో ఉండేది. 

►ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. 

►క్రూయిజ్‌ షిప్స్‌, యూఎస్‌ నేవీ షిప్స్‌లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు.

 

►ఈమధ్యకాలంలో సోలార్‌ పవర్డ్‌ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. 

► ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్‌ ఖున్‌జెరబ్‌ పాస్‌లో ఉంది.  సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌లోనూ పని చేస్తుంది. 

►సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్‌ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్‌ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వల్ల ఈ తరహా నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. 

 

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement