Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి | Sakshi
Sakshi News home page

Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి

Published Tue, Feb 27 2024 4:43 AM

Ashwini Vaishnav: India economy will grow with 8 percent real growth in the next 10 years - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి  మంత్రి అశ్విని వైష్ణవ్‌ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్‌ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు.  రైసినా డైలాగ్‌ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు.  

గ్రీన్‌ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్‌ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌  
పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్‌ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్‌ 2024’లో కాంత్‌ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో  పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ,  ప్రపంచ బ్యాంక్‌  ‘వాతావరణ బ్యాంకుగా’  మారాల్సిన అవసరం ఉందని అన్నారు.  భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు.

Advertisement
Advertisement