ఐఫోన్లపై పెగాసస్‌ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్‌

Apple iPhone of journalists politicians hit by pegasus style spyware attack - Sakshi

 జర్నలిస్టులు, పొలిటీషియన్ల  ఐఫోన్లు హ్యాక్:  క్వాడ్రీమ్ సర్వర్‌లను గుర్తింపు

 మైక్రోసాఫ్ట్  అండ్‌  డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకుల నివేదిక

న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్‌ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను  హ్యాకింగ్‌పై షాకింగ్‌ రిపోర్ట్‌ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు  చెందిన  ఐఫోన్లు  ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్‌ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు  మైక్రోసాఫ్ట్  అండ్‌  డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)

మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్‌ ద్వారా హ్యాక్‌ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్‌ డివైస్‌లే  లక్ష్యంగా  ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్‌  ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది.   ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్‌లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్‌లలో క్వాడ్రీమ్ సర్వర్‌లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్‌: చిన్న డ్రాప్‌ ధర పదివేలకు పైనే)

'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్  దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు  ఏదైనా హానికరమైన, ఫిషింగ్‌ లింక్స్‌ పై  క్లిక్‌ చేయకుండానే  జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు  అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది.  (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్‌)

కాగా పెగాసెస్‌ వివాదం నేపథ్యంలో యాపిల్‌  స్పైవేర్‌ డిటెక్టర్‌ టూల్‌  ‘ఇమేజింగ్‌’ను తీసుకొచ్చింది. దీని ద్వారా  ఐఫోన్లలో ‘పెగాసెస్‌ స్పైవేర్‌’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్‌ ఐఫోన్‌ బ్యాకప్‌, ఇతర ఫైల్స్‌ను చెక్‌ చేసి మాల్వేర్‌ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్‌డేట్‌ చేసినసంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top