Know Reason Behind Why Scorpion Venom Is The Costliest Liquid In The World - Sakshi
Sakshi News home page

షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్‌: చిన్న డ్రాప్‌ ధర పదివేలకు పైనే

Apr 12 2023 4:47 PM | Updated on Apr 12 2023 5:24 PM

Scorpion venom is the costliest liquid in the world Shocking price - Sakshi

సాక్షి,ముంబై: విషపూరిత జీవుల్లో ఒకటి తేలు. తేలు కుడితే వచ్చే బాధ వర్ణనా తం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటి తేలు విషం ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్‌గా నిలుస్తుండటం విశేషం. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల తేళ్లను పెంచుతూ వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు.  మార్కెట్‌లో  దీని విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. దాదాపు లీటరుకు వందకోట్ల రూపాయలకు పై మాటే. 

అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్‌ తేలు విషం భారీ ఖరీదు పలుకుతోంది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం డెత్‌స్టాకర్  అనే తేలు విషంలో మనుషులకి ప్రాణాంతకం కాదు గానీ, అంతకుమించిన మంచి గుణాలున్నాయి. 2021 నాటికి విషం చుక్క ధర 130 డాలర్లు.  4 లీటర్ల డెత్‌ స్టాకర్‌ జాతికి చెందిన తేలు విషం ధర 320 కోట్ల రూపాయలుగా ఉంది.  ఒక తేలు ఒకసారి రెండు మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ఒక లీటర్‌ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి  ఉంటుంది. బ్రిటానికా  డాట్‌ కాం ప్రకారం, డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం గ్యాలన్ ధర 39 మిలియన్ల డాలర్లు. గ్యాలన్‌ విషంకోసం 2.64 మిలియన్ల సార్లు విషం తీయాలి లేదంటే 27 లక్షల తేళ్లనుండి విషాన్ని సేకరిస్తే ఒక గాలన్ నిండుతుందన్నమాట.  (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు
డెత్‌స్టాకర్‌  తేళ్లు నార్త్‌ ఆఫ్రికానుంచి మిడిల్‌ ఈస్ట్‌లోని ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సహారా, అరేబియన్‌, థార్‌ సెంట్రల్‌, సెంట్రల్‌ ఏషియా ఎడార్లు జీవిస్తుంటాయి. వీటి విషంలో న్యూరో టాక్సిన్స్‌, క్లారోటాక్సిన్స్‌.. క్యారిబ్డోట్యాక్సిన్స్‌, సిల్లాటాక్సిన్స్‌, ఏజిటాక్సిన్స్‌ ఉంటాయి. అంతేకాదు ఈ విషాన్ని సేకరించిందేందుకు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తారు. తేళ్ల కొండిలకు పరికరం  ద్వారా  విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. అప్పుడు వాటంతట అవే  విడుదల చేసే విషాన్ని సేకరిస్తారు.  

ప్రాణం పోసే విషం! ఎందులో వాడతారంటే?
ఈ తేలు విషాన్ని క్యాన్సర్ కణితులను గుర్తించడంలోనూ,  మలేరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారట. అందుకే దీనికి ఇంత డిమాండ్‌. అలాగే మెదడు కణితుల చికిత్సల, డయాబెటీస్‌ నివారణలోనూ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు. డెత్‌స్టాకర్ స్కార్పియన్స్ విషంలో ఉండే క్లోరోటాక్సిన్‌ని కొన్నిరకాల క్యాన్సర్‌ల చికిత్సలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్‌ గడ్డలుఎక్కడ, ఏపరిమాణంలో ఉన్నాయో గుర్తించవచ్చట. అయితే డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం ప్రాణాంతకమైంది కాదు. ఇది కుడితే భయంకరమైన నొప్పి ఉంటుంది తప్పితే ఆరోగ్యకరమైన వయోజనులను చంపేంత విషపూరితమైంది కాదని స్వయంగా పరిశోధకులు వెల్లడించారు. కానీ పిల్లలు, వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలని  సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement