మాట నిలబెట్టుకున్న గుల్మోహర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న గుల్మోహర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published Sun, May 26 2024 6:00 PM

Anand Mahindra Tweet About Dahisar River

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఇందులో మురుగు నీటి కాలువను చూడవచ్చు. దానికి ఒద్దు మీద ఓ చెట్టు పువ్వులతో వికసిస్తూ.. కనిపించింది.

ఆనంద్ మహీంద్రా ఈ ఫోటో షేర్ చేస్తూ.. ''మేము దహిసర్ నదిని అన్ని రకాల కాలుష్య కారకాలతో ముదురు నల్లగా చేసాము. కానీ నది ఒడ్డున ఉన్న గుల్మోహర్ మాత్రం పూర్తిగా వికసిస్తానని తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. దహిసర్ నదిలో దాని ప్రతిబింబాన్ని మళ్లీ చూడటానికి వేచి ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ప్రారంభించడంతో దాని కోరిక నెరవేరుతుంది'' అని అని ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టుకు పలువులు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement