Ola Electric: అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం..!

Amid Ev Fire Incidents Ola Electric Recalls 1441 E-scooters - Sakshi

దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పలు కంపెనీల స్కూటర్లు అగ్రి ప్రమాదాలకు గురికావడంతో ఆయా కంపెనీలు సదరు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను వెనక్కి పిలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో  ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

1,441 వెనక్కి..!
పేలుళ్ల నేపథ్యంలో...1441 యూనిట్ల ఒలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌  ప్రకటించింది. మార్చి 26న పుణెలో జరిగిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.  ప్రమాదానికి గురైన స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించామని తెలిపింది. అందులో భాగంగానే ఈ రీకాల్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

బ్యాటరీ వ్యవస్థలు, థర్మల్‌ వ్యవస్థలపై తమ సర్వీస్‌ ఇంజినీర్లు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తారని ఓలా తెలిపింది. తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు భారత ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా సరిపోతాయని పేర్కొంది. ఇటీవల పుణెలో జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఘటనపై ఇంకా పూర్తిస్థాయి సమీక్ష కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

చదవండి: ఆ స్కూటర్లు కూడా రీకాల్‌.. ఒకినావా బాటలో ప్యూర్‌ ఈవీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top