అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో బంపర్ ఆఫర్లు | Amazon Great Indian Festival 2021 To Start From October 4 | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో బంపర్ ఆఫర్లు

Sep 24 2021 6:06 PM | Updated on Sep 24 2021 6:56 PM

Amazon Great Indian Festival 2021 To Start From October 4 - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2021 అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీని అమెజాన్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో టీజ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్‌ ప్రకటించడం విశేషం. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్స్‌లో అమెజాన్ పోటీదారు ఫ్లిప్‌కార్ట్‌ కూడా పండుగ ఆఫర్లతో దూసుకు వస్తోంది. 

అక్టోబర్‌ నెల 7వ తేదీ నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్లను ఆకర్షించడం కోసం అమెజాన్ వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్ససరీలు, స్మార్ట్ వాచ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సహా గృహోపకరణాలపై డిస్కౌంట్లను సూచించే మైక్రోసైట్ రూపొందించింది. అమెజాన్‌ ఎకో, ఫైర్‌ స్టిక్‌, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. దీంతో పాటు యాపిల్‌, ఆసుస్‌, ఫాజిల్‌, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు.(చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనదారుల ఛార్జింగ్‌ కష్టాలకు చెక్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement