అమెజాన్‌ మైండ్‌బ్లోయింగ్‌ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్‌!

Amazon Diwali Sale: These 5 Gadgets Buy Under 2500 - Sakshi

పండగలు వస్తే విద్యాసంస్థలు సెలవులు ఇచ్చినట్లే కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. దసరా అయ్యిందో లేదో వెనకే దీపావళి సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో దీపావళి సేల్ ప్రారంభించనుంది. ఈ సారి పండుగకి మీ ఇంటికి అవసరమయ్యే గ్యాడ్జెట్లు లేదా మీ ప్రియమైన బెస్టీలకు విలువైన గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా! అయితే దీనికి సమాధానం తమ వద్ద ఉందని ఆమెజాన్‌ ఇండియా అంటోంది.

ప్రస్తుతం కొనసాగుతున్న Amazon Great Indian Festival సేల్‌లో కొనుగోలుదారులు కొన్ని గాడ్జెట్‌లపై అదనపు డిస్కౌంట్లతో తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. RGB LED ల్యాంప్‌ కలర్‌తో వస్తుంది.

Odzeni Crystal Rose Diamond Led Lamp:
ఇది ₹1,299 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీని అసలు ధర ₹3,599 ఉండగా ప్రస్తుతం Amazonలో 64% తగ్గింపుతో కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. USB ఛార్జింగ్‌తో వస్తోంది. ఒక ఛార్జ్‌తో 8 గంటల వరకు పని చేస్తుంది. ఈ ల్యాంప్‌ మూడింతల బ్రైట్‌నెస్ లైటింగ్ అందిస్తుంది.

సరేగామా కార్వాన్ మినీ హిందీ 2.0- మ్యూజిక్ ప్లేయర్
ఈ ప్రాడెక్ట్‌ అసలు ధరపై 19% తగ్గింపు తర్వాత, Saregama Carvan Mini Hindi 2.0- Music Player ప్రస్తుతం కొనసాగుతున్న Amazon సేల్‌లో ₹1,499కే లభిస్తోంది. మ్యూజిక్ ప్లేయర్ 351 ఎవర్ గ్రీన్ హిందీ పాటలతో ప్రీలోడ్ చేసి ఉంటుంది. మీ పర్సనల్ సాంగ్స్ కలెక్షన్ కోసం USB బ్లూటూత్ మోడ్‌లను కలిగి ఉంది.

వన్‌ ప్లస్‌ స్మా‍ర్ట్‌ బ్యాండ్‌ (OnePlus Smart Band):
OnePlus స్మార్ట్ బ్యాండ్ 100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ సౌకర్యం ఉంది. స్మార్ట్ బ్యాండ్ 1.1-అంగుళాల స్క్రీన్‌ తో స్టైలిష్‌ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అమెజాన్‌లో ₹1,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. 

Echo Dot (4th Gen, Blue) combo :
Wipro 9W LED smart color bulb నాలుగు రేట్ల బ్రైట్‌నెస్‌ కాంతిని అందిస్తుంది. విప్రో 9W LED స్మార్ట్ కలర్ బల్బ్‌తో ఎకో డాట్ (4వ జనరేషన్, బ్లూ) కాంబో.. విప్రో బల్బ్ కాంబోతో కూడిన ఈ Amazon Echo Dot (4వ జనరేషన్) Amazonలో రూ. 2,499కి కొనుగోలు చేయవచ్చు.

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top