ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

Mahindra Suv More Waiting Period For Some Cars Like Scorpio, Xuv700 - Sakshi

భారత ఆటోమొబైల్‌ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యువి 700 లాంచ్‌ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్‌ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీం‍ద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్‌ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు.


 నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది.  అయినా వీటికి డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మహీంద్రా స్కార్పియో ఎన్
ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది.

ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్‌ ఉంది. ఇతర వేరియంట్‌లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉ‍న్నాయి.
 

మహీంద్రా XUV700
మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్‌ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్‌లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది.


స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి.

చదవండి: ఐఫోన్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top