చంద్రుడి మీదకు అలెక్సా, ఆస్ట్రోనాట్స్‌కు న్యూస్‌తో పాటు క్రికెట్‌ స్కోర్‌ కూడా!

Amazon Alexa travel to space  - Sakshi

నాసా సైంటిస్ట్‌లు 'చంద్రుడిపై మానవుడి నివాసం' అనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. 1972లో నాసా అపోలో17 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఇప్పుడు మరోసారి ఆర్టెమిస్ మిషన్ సిరీస్‌ పేరుతో 2025లోపు సైంటిస్ట్‌ల ప్రయోగాలకు అనువుగా ఉండే చంద్రుడి మీద లూనార్‌ సౌత్‌ పోలే'పై కాలుమోపనున్నారు.ఈ నేపథ్యంలో లూనార్‌ సౌత్‌ పోలే మీద ఎవరు కాలు మోపనున్నారు? ఆ ప్రాంతం ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. అయితే మనుషుల కంటే ముందే అమెజాన్‌ వాయిస్‌ అలెర్ట్‌ అలెక్సా ఆ ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

విశ్వంలో భూమి తర్వాత మనుషులు నివసించే అనుకూల గ్రహం కోసం సైంటిస్ట్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి ఆశలు చంద్రుడి మీదనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో చందమామ మీద నివాసం ఉండే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా..నాసా సైంటిస్ట్‌లు 'నాసా ఓరియన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌' లో అమెజాన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను అలెక్సాను చంద్రుడి మీద లూనార్‌ సౌత్‌ పోలే అనే ప్రాంతం మీదకు పంపనున్నారు.

ఈ ప్రయోగంలో భాగంగా నాసా సైంటిస్ట్‌లు అలెక్సా లేటెస్ట్‌ వెర్షన్‌ను కాలిస్టో పేలోడ్‌లో అమర్చేందుకు అమెజాన్, సిస్కో, లాక్‌హీడ్ మార్టిన్‌ సంస్థల టెక్‌ నిపుణులతో కలిసి పనిచేస్తుంది. ఆర్టెమిస్‌ ప్రయోగ సమయంలో తీవ్రమైన జర్క్‌లు, వైబ్రేషన్‌, రేడియేషన్ ఎక్స్‌పోజర్‌ను తట్టుకునేలా డెవలప్‌ చేయనున్నారు. 

స్పేస్‌లో అలెక్సా
చంద్రుడి మీద అలెక్సా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా పని చేసేలా నాసా సైంటిస్ట్‌లు డిజైన్‌ చేస్తున్నారు. అంతేకాదు చంద్రుని నుండి భూమికి..భూమి నుంచి తిరిగి చంద్రుడి మీదకు ఆలస్యం కాకుండా ఇన్ఫర్మేషన్‌ స్పీడ్‌గా రిసీవ్‌ చేసుకుంటుందని అమెజాన్‌ తెలిపింది. అలెక్సా ఉన్న నాసా ఓరియన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌' ఎంత స్పీడ్‌గా ప్రయాణిస్తోంది.టెంపరేచర్‌ ఎంత ఉంది అనే సమాచారాన్ని అలెక్సా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇవ్వనుంది. దీంతో పాటు ఆస్ట్రోనాట్స్‌ అలెక్సా ద్వారా న్యూస్‌, క్రికెట్‌ స్కోర్‌ భూమి నుంచి అప్‌డేట్‌లు పొందనున్నారని 'అమెజాన్‌ అలెక్సా ఎవ్రివేర్‌' వైస్ ప్రెసిడెంట్ ఆరోన్ రూబెన్‌సన్ అన్నారు. కాగా, అలెక్సాను ఈ ఏడాది మార్చి - ఏప్రిల్‌ మధ్య కాలంలో చంద్రుడి పంపాలని నాసా సైంటిస్ట్‌లు భావిస్తున్నారు.

చదవండి: మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top