ఇక పై హే అలెక్సా.. అంటే అమితాబ్‌ బచ్చన్‌ వస్తాడు..!

Amazon Alexa Gets Amitabh Bachchan Voice In India For A Price - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన ఉత్పత్తుల్లో భాగంగా...మార్కెట్లలోకి అమెజాన్‌ ఈకో స్మార్ట్‌ స్పీకర్స్‌ను రిలీజ్‌ చేసింది. ఈ స్పీకర్లలో అమర్చిన అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సా ద్వారా కొన్ని పనులను సులభతరం చేస్తాయి. హే అలెక్సా అనగానే..తన మాటలతో వాయిస్‌ అసిస్టెంట్‌ మంత్ర ముగ్దులను చేస్తోంది. అలారమ్‌ సెట్‌ చేయడంలో, కొన్ని పనులను సంబంధించి రిమైండ్‌ చేయడంలో అలెక్సా ఎంతగానో ఉపయోగపడుతుంది. 

తాజాగా అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌కు సరికోత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ఈ ఫీచర్‌తో హే అలెక్సా అనగానే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ వస్తుంది. అమెజాన్‌ గురువారం రోజున తొలిసారిగా ఈ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు, కొత్త వారికి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. అమెజాన్‌ కొత్త కస్టమర్లను ఆకర్షించుకునేందుకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. అమెజాన్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌ను అలెక్సాలో ప్రారంభ ధర రూ. 149 (అసలు ధర రూ. 299)  ఏడాదికి చెల్లించడం ద్వారా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తుంది.

సెలెబ్రిటీ వాయిస్ కొనుగోలు చేయడానికి ముందుగా "అలెక్సా,  ఇంట్రడ్యూస్‌ మీ టూ అమితాబ్ బచ్చన్‌ జీ ’’ అని అలెక్సాతో చెప్పాలి. మీరు ఈ ఫీచర్‌ను అమెజాన్‌ సైట్ నుంచి నేరుగా పొందవచ్చు . ఒకసారి చెల్లింపు పూర్తైందని నిర్ధారించిన తర్వాత, మీరు అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌తో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టవచ్చు. అలెక్సా బదులు అమిత్‌ జీ అని పిలిచి కూడా మీరు బచ్చన్‌ వాయిస్‌తో ఇంటారక్ట్‌ అవ్వచును. అమెజాన్‌ ఇది వరకు అమెరికాలో హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ శ్యామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌ వాయిస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top