Artemis I mission series
-
చందమామను చుట్టొచ్చేలా...
మనిషి చివరిసారిగా చంద్రునిపై దిగి 50 ఏళ్లు దాటింది. అర్ధ శతాబ్ది సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్–2 స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ శనివారం కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ ప్యాడ్‌కు చేరింది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 6న ఆర్టెమిస్–2 ప్రయోగం జరగనుంది. దీనిద్వారా నలుగురు వ్యోమగాములు ఓరియాన్ స్పేస్ క్యాప్సూల్‌లో చంద్రుని చుట్టూ పరిభ్రమించి రానున్నారు. అమెరికాకు చెందిన నాసా కమాండర్ రీడ్ వైజ్మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జెరెమీ హన్సెన్ ఈ మిషన్‌లో భాగస్వాములు. ఓరియాన్ క్యాప్సూల్ భూ దిగువ కక్ష్యను దాటుకుని చంద్రుని చుట్టూ ఓ రౌండ్ కొట్టి భూమికి 10 రోజుల అనంతరం తిరిగి వస్తుంది. తద్వారా వ్యోమగాములు చంద్రునిపై దిగేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేస్తుంది. అనంతరం ఆర్టెమిస్–3 మిషన్‌లో భాగంగా వ్యోమగాములను చంద్రునిపై దింపాలన్నది నాసా లక్ష్యం. ఆర్టెమిస్–2 ఫలితాన్ని బట్టి 2027లో గానీ, 2028లో గానీ ఈ మిషన్‌ను చేపట్టే అవకాశముంది. నాసా చివరిసారిగా 1972లో అపోలో 17 మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వ్యోమగాములను పంపింది. ఆర్టెమిస్–2 ఎస్ఎల్ఎస్ రాకెట్ ఎత్తు ఏకంగా 100 మీటర్లు కావడం విశేషం. ఇక దీని బరువు 5,000 టన్నులు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్టెమిస్ 1 ప్రయోగం నిలిపివేత.. ప్రకటించిన నాసా
తల్లాహస్సీ: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్‌డౌన్ గడియారం నిలిపివేసింది నాసా. అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఇవాళ(సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది. ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్లు ఇంజిన్లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది. అంతకు ముందు కౌంట్‌డౌన్ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా. The countdown clock is on a hold at T-40 minutes. The hydrogen team of the @NASA_SLS rocket is discussing plans with the #Artemis I launch director. Operational commentary continues at https://t.co/z1RgZwQkWS. pic.twitter.com/5J6rHVCe44 — NASA (@NASA) August 29, 2022 The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom — NASA (@NASA) August 29, 2022 ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. శాశ్వత ఆవాసాల కోసం.. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా.. ఆర్టెమిస్-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి. ఇదీ చదవండి: ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే? -
చంద్రుడి మీదకు అలెక్సా, ఆస్ట్రోనాట్స్‌కు న్యూస్‌తో పాటు క్రికెట్ స్కోర్ కూడా!
నాసా సైంటిస్ట్‌లు 'చంద్రుడిపై మానవుడి నివాసం' అనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. 1972లో నాసా అపోలో17 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఇప్పుడు మరోసారి ఆర్టెమిస్ మిషన్ సిరీస్ పేరుతో 2025లోపు సైంటిస్ట్‌ల ప్రయోగాలకు అనువుగా ఉండే చంద్రుడి మీద లూనార్ సౌత్ పోలే'పై కాలుమోపనున్నారు.ఈ నేపథ్యంలో లూనార్ సౌత్ పోలే మీద ఎవరు కాలు మోపనున్నారు? ఆ ప్రాంతం ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. అయితే మనుషుల కంటే ముందే అమెజాన్ వాయిస్ అలెర్ట్ అలెక్సా ఆ ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశ్వంలో భూమి తర్వాత మనుషులు నివసించే అనుకూల గ్రహం కోసం సైంటిస్ట్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి ఆశలు చంద్రుడి మీదనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో చందమామ మీద నివాసం ఉండే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా..నాసా సైంటిస్ట్‌లు 'నాసా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్' లో అమెజాన్ లేటెస్ట్ వెర్షన్‌ను అలెక్సాను చంద్రుడి మీద లూనార్ సౌత్ పోలే అనే ప్రాంతం మీదకు పంపనున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా నాసా సైంటిస్ట్‌లు అలెక్సా లేటెస్ట్ వెర్షన్‌ను కాలిస్టో పేలోడ్‌లో అమర్చేందుకు అమెజాన్, సిస్కో, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థల టెక్ నిపుణులతో కలిసి పనిచేస్తుంది. ఆర్టెమిస్ ప్రయోగ సమయంలో తీవ్రమైన జర్క్‌లు, వైబ్రేషన్, రేడియేషన్ ఎక్స్పోజర్ను తట్టుకునేలా డెవలప్ చేయనున్నారు. స్పేస్‌లో అలెక్సా చంద్రుడి మీద అలెక్సా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా పని చేసేలా నాసా సైంటిస్ట్‌లు డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు చంద్రుని నుండి భూమికి..భూమి నుంచి తిరిగి చంద్రుడి మీదకు ఆలస్యం కాకుండా ఇన్ఫర్మేషన్ స్పీడ్‌గా రిసీవ్ చేసుకుంటుందని అమెజాన్ తెలిపింది. అలెక్సా ఉన్న నాసా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్' ఎంత స్పీడ్‌గా ప్రయాణిస్తోంది.టెంపరేచర్ ఎంత ఉంది అనే సమాచారాన్ని అలెక్సా ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వనుంది. దీంతో పాటు ఆస్ట్రోనాట్స్ అలెక్సా ద్వారా న్యూస్, క్రికెట్ స్కోర్ భూమి నుంచి అప్డేట్లు పొందనున్నారని 'అమెజాన్ అలెక్సా ఎవ్రివేర్' వైస్ ప్రెసిడెంట్ ఆరోన్ రూబెన్సన్ అన్నారు. కాగా, అలెక్సాను ఈ ఏడాది మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో చంద్రుడి పంపాలని నాసా సైంటిస్ట్‌లు భావిస్తున్నారు. చదవండి: మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం


