అప్పుడు నారాయణమూర్తి ఇలా సమాధానమిచ్చారు - ట్రూకాలర్ సీఈఓ

Alan Mamedi Tweet About Infosys NarayanaMurthy - Sakshi

ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తిని ఎనిమిదేళ్ల క్రితం కలిసినట్లు, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. ట్రూకాలర్ సీఈఓ 'అలాన్ మామెడి' ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం మొదటిసారి నారాయణ మూర్తిని కలిసినప్పుడు అతడెవరో తనకు తెలియదని, నేనెవరో ఆయనకు తెలియదని వెల్లడించాడు. వారివురు మాట్లాడుకునే సమయంలో మీరు ఏమి చేస్తారని అడిగానని అలాన్ చెప్పాడు. దీనికి సమాధానంగా 'జీవితంలో నాకు అదృష్టం ఉండటం వల్ల ప్రజలకు తప్పకుండా కొంత సాయం చేయాలని నా భార్య ఎప్పుడూ నాతో చెబుతుంది, అదే చేస్తున్న అని చెప్పాడని ట్వీట్‌లో వెల్లడించాడు. వందలకోట్ల సంపద ఉన్నప్పటికీ నారాయణ మూర్తి చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని అలాన్ మామెడి వెల్లడించాడు.

ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్

నిజానికి నేను (అలాన్ మామెడి) చదువుకునే రోజుల్లో మా ఇంట్లో కంప్యూటర్ బాగుచేయడానికి ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చాడని.. అప్పుడే ఆ సంస్థలో ఉద్యోగం చేయాలనుకున్నట్లు వివరించాడు. కానీ జీవితం ఎలా ముందుకు సాగుతుందో తెలియదని ఇందులో ప్రస్తావించాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top