
న్యూఢిల్లీ: బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కొత్త చైర్మన్‌గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేత్‌ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు సేత్‌ను ఈ పదవిలో నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
అజయ్ సేత్ 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. నాలుగేళ్ల పాటు కేంద్ర ఆర్థిక శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలు అందించిన అనంతరం ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేశారు. దేవాశిష్ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియగా, అప్పటి నుంచి ఐఆర్‌డీఏఐ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.