ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం

Published Mon, May 20 2024 9:03 AM

Air India Passenger Flying From New York To Delhi Shared A Viral Video On Instagram

ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. 
 
అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.

అకల్‌ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్‌ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్‌లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement