ప్రమాదంలో 30 కోట్ల ఉద్యోగాలు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వెలుగులోకి సంచలన నివేదిక!

Ai Could Replace The Equivalent Of Around 300 Million Full-time Jobs - Sakshi

టెక్ వరల్డ్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) తో పనిచేసే ‘చాట్‌ జీపీటీ’ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చాట్‌ జీపీటీని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మెరిసేదంతా బంగారం కాదని.. ఏఐ టూల్స్‌ జాబ్‌ మార్కెట్‌లో అలజడులు సృష్టిస్తాయంటూ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ సాక్స్‌ తీవ్ర హెచ‍్చరికలు జారీ చేసింది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన‍్ల (30 కోట్ల) ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలపై ప్రభావం పడనున్నట్లు అంచనా వేసింది. ఏఐ పూర్తి స్థాయిలో తన సామార్ధ్యాలను వినియోగిస్తే లేబర్‌ మార్కెట్‌ కుప్పకూలిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా, యూరప్‌ దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా 2/3 వంతుల ఉద్యోగాలు ఆటోమేషన్‌కు గురవుతున్నాయని,  ప్రస్తుత పనిలో నాలుగింట ఒక వంతు వరకు భర్తీ చేయగలదని గుర్తించినట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ తెలిపారు.

ఇక ఏఐతో అడ్మినిస్ట్రేటివ్ 46 శాతం, లీగల్‌ జాబ్స్ 44 శాతం ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేయనున్నట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. నిర్మాణ‌, మెయింటెనెన్స్ రంగాల్లో ఉద్యోగాలు వ‌రుస‌గా 6 శాతం, 4 శాతం మేర దెబ్బ‌తింటాయ‌ని సమాచారం. జ‌న‌రేటివ్ ఏఐతో కార్మికుల డిమాండ్ త‌గ్గుతుంద‌ని, కార్మిక ఉత్పాద‌క వృద్ధిపై సానుకూల ప్ర‌భావం ఉంటుంద‌ని గోల్డ్‌మన్‌ సాక్స్‌ తన రిపోర్ట్‌లో తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top