
అగిలిసియం సీఈఓ రాజ్ బాబు, శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఉమాశేఖర్
చెన్నై: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ప్రధాన అడుగు పడింది. దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించిన ఏఐ కంపెనీ అజిలిసియం, శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (SRIHER) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
మెరుగైన రోగ నిర్ధారణ, వ్యక్తిగతీకరించిన చికిత్స, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం ఏఐ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడం, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, డిజిటల్ ట్విన్స్, స్మార్ట్ హాస్పిటల్ టెక్ వంటి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ రూపొందించడం క్లినికల్ డేటా నాణ్యత, ఇంటర్ ఆపరేబిలిటీ, పరిశోధన సంసిద్ధతను మెరుగుపరచడానికి క్లీన్ హెల్త్ డేటా ఇనిషియేటివ్‌ను క్రియేట్ చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు.
ఒప్పందంలో భాగంగా ఏఐ టూల్స్, జీఎన్ఏఐ, డేటా సైన్స్, అనలిటిక్స్ వంటివి అగిలిసియం సంస్థ సమకూర్చనుండగా రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్లినికల్ డేటాసెట్లు, డొమైన్ నిపుణులు, ఆసుపత్రి వాతావరణం వంటివి కల్పించనుంది. వీటితోపాటు అకడమిక్ సహకారంలో భాగంగా హెల్త్ కేర్ లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఔషధ ఆవిష్కరణ, రోగనిర్ధారణ, రోగి సంరక్షణలో భవిష్యత్తు ప్రతిభకు శిక్షణ ఇవ్వనుంది.