జర్నలిస్టులపై బ్యాన్‌,ట్విటర్‌ స్పేసెస్‌కు బ్రేక్‌..బైడెన్‌పై సెటైర్లు

After suspending accounts of some journalists Musk disables Twitter Spaces - Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌లో ఆడియో లైవ్‌ సర్వీస్‌ స్పేసెస్‌ పనిచేయక పోడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గురువారం అర్థరాత్రి నుంచి స్పేసెస్‌ పనిచేయడం మానేసింది. దీంతో ట్విటర్‌ ద్వారా ఏమైంది స్పేసెస్‌కు అంటూ వాకబు చేయడం మొదలుపెట్టారు. దీంతో  ట్విటర్‌  బాస్‌,  ఎలాన్‌ మస్క్‌ స్పందించారు.లండన్‌లోని సోహోలో తన మొదటి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఏదీ కూడా ఉచిత ఉత్పత్తులను అందించలేదు.

కొంతమంది జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసిన తర్వాత ట్విటర్‌ స్పేసెస్‌ నిలిచిపోవడం చర్చకు దారి తీసింది. సస్పెండ్ అయిన పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ అందులో పాల్గొనవచ్చనే అనుమానంతో మస్క్‌ అలా చేశారంటైటూ విమర్శలు చెలరేగాయి. దీంతో ట్వీపుల్‌ ట్వీట్లకు స్పందించిన ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ ద్వారానే వివరణ ఇచ్చారు.ఇందులోని  లెగసీ బగ్‌ (పాతబగ్‌)ను పరిష్కరిస్తున్నాం అని  బహుశా రేపటికి పని చేస్తుందంటూ వివరణ ఇచ్చారు.

కాగా  సీఎన్‌ఎన్‌   నెట్‌వర్క్‌,  న్యూయార్క్ టైమ్స్ ,వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన డ్రూ హార్వెల్ ,  Mat Binder Mashable సహా పలువురు  జర్నలిస్టుల ఖాతాలను  ట్విటర్‌ గురువారం సస్పెండ్ చేసింది. తన ప్రైవేట్ జెట్  విషయాలను  బహిర్గంతం చేసినందుకు ఏడు రోజుల సస్పెన్షన్‌లో పెట్టినట్టు మస్క్‌ ప్రకటించారు. డాక్సింగ్ నియమాలు అందరితోపాటు జర్నలిస్టులకు కూడా వర్తిస్తాయనీ తనను  నిరంతరం విమర్శించడం  తప్పు కాదు. కానీ తన రియల్‌ టైం వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం  ట్విటర్‌ నిబంధనలకు  విరుద్ధమని, తన ఫ్యామిలీకి  ఉనికికి ప్రమాదమని  పేర్కొన్నారు.

అంతేకాదు సదరు జర్నలిస్టుల రియల్‌  లొకేషన్‌, చిరునామా లాంటివి రివీల్‌ చేస్తే ఎఫ్‌బీఐ విచారణ  చేస్తుంది..  ప్రజాస్వామ్యానికి  ముప్పు అంటూ  బైడెన్‌  స్పీచ్‌ లిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడి పైనే సెటైర్లు వేశారు.

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top