After Mumbai, Apple CEO Tim Cook reaches Delhi lauds Lodhi Art District - Sakshi
Sakshi News home page

Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్

Apr 19 2023 2:54 PM | Updated on Apr 19 2023 3:20 PM

 After Mumbai Apple CEO Tim Cook reaches Delhi lauds Lodhi Art District - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో యాపిల్‌ స్టోర్లు ప్రారంభం ‍ కానున్న నేపథ్యంలో యాపిల్‌ సీఈవో దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబైలలో పర్యటిస్తున్నారు. ముందుగా ముంబైలోని యాపిల్‌ స్టోర్‌ ప్రారంబించిన  అనంతరం కుక్‌  దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. గురువారం ఢిల్లీలోని యాపిల్‌ స్టోర్‌ను కుక్‌ ప్రారంభించనున్నారు.

లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్‌లోని మంత్రముగ్ధుల్ని  చేసే కళాత్మక  చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కళాకారులు.. 62 ఏళ్ల భారతీయ జీవితాన్ని చాలా శక్తి వంతంగా చిత్రీకరించారంటూ స్టేట్‌ ఆర్టిస్ట్‌  ఫౌండేషన్‌ ఆర్టిస్టులను  అభినందించారు. ముఖ్యంగా ఐప్యాడ్‌లో కుడ్య చిత్రాలను ఎలా డిజైన్ చేస్తారో తనకు చూపించిన దత్తరాజ్ నాయక్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా ఇండియాలోకి యాపిల్ఎంటరై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్‌ను  ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాపిల్‌ సీఈవో హాజరు కావడంతో అభిమానులు సందడి చేశారు.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, అలనాటి అందాల హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్‌, తదితర సెలబ్రిటీలు కుక్‌ను కలవడం విశేషంగా నిలిచింది. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్‌తో ఒకయాపిల్‌ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను ఏప్రిల్‌ 20న (రేపు) ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement