breaking news
Remarkable
-
Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్
న్యూఢిల్లీ: దేశంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యాపిల్ సీఈవో దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబైలలో పర్యటిస్తున్నారు. ముందుగా ముంబైలోని యాపిల్ స్టోర్ ప్రారంబించిన అనంతరం కుక్ దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. గురువారం ఢిల్లీలోని యాపిల్ స్టోర్‌ను కుక్ ప్రారంభించనున్నారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్‌లోని మంత్రముగ్ధుల్ని చేసే కళాత్మక చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కళాకారులు.. 62 ఏళ్ల భారతీయ జీవితాన్ని చాలా శక్తి వంతంగా చిత్రీకరించారంటూ స్టేట్ ఆర్టిస్ట్ ఫౌండేషన్ ఆర్టిస్టులను అభినందించారు. ముఖ్యంగా ఐప్యాడ్‌లో కుడ్య చిత్రాలను ఎలా డిజైన్ చేస్తారో తనకు చూపించిన దత్తరాజ్ నాయక్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇండియాలోకి యాపిల్ఎంటరై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో హాజరు కావడంతో అభిమానులు సందడి చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, అలనాటి అందాల హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్, తదితర సెలబ్రిటీలు కుక్‌ను కలవడం విశేషంగా నిలిచింది. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్‌తో ఒకయాపిల్ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను ఏప్రిల్ 20న (రేపు) ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు.