ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు కొత్త హెచ్‌ఆర్‌ హెడ్‌

Aditya Birla group names Ashok Ramchandran new HR head - Sakshi

భారతీయ ప్రముఖ వ్యాపార సమ్మేళనం ఆదిత్య బిర్లా గ్రూప్‌ తమ కొత్త హెచ్‌ఆర్‌ హెడ్‌ను ప్రకటించింది. ముందస్తు పదవీ విరమణ తీసుకుంటున్న సంతృప్త్‌ మిశ్రా స్థానంలో అశోక్ రామ్‌చంద్రన్‌ను డైరెక్టర్ (హెచ్‌ఆర్) గా నియమించింది. 

నియామక మార్పులు 2024 జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయి. అశోక్ రామ్‌చంద్రన్ ప్రస్తుతం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 నుంచి ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కొనసాగుతున్నారు.  గ్రూప్‌లో చేరడానికి ముందు వోడాఫోన్ ఇండియాలో హెచ్‌ఆర్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్‌ఆర్‌ విభాగంలో అశోక్‌ రామచంద్రన్‌కు 34 సంవత్సరాల అనుభవం ఉంది.

ఇక డాక్టర్ సంతృప్త్‌ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హెచ్‌ఆర్‌ గ్లోబల్ డైరెక్టర్, అలాగే బిర్లా కార్బన్ గ్రూప్ డైరెక్టర్, కెమికల్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మిశ్రా 1996లో హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి హెచ్‌ఆర్‌ వైస్ ప్రెసిడెంట్‌గా గ్రూప్‌లో చేరారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top