నీ గొడుగు సల్లగుండ..ధర లక్షరూపాయలంట! ఏముంది ఇందులో!

Adidas,gucci Are Selling A 1,644 Dollars Umbrella That Doesn Protect From The Rain - Sakshi

ట్రెండ్‌కు తగ్గట్లు నేటి యువత ప్యాషన్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. నుదుటున పెట్టుకొనే కుంకుమ బొట్టు దగ్గర నుంచి సమ్మర్‌ సీజన్‌లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు వినియోగించే గొడుగు వరకు..ఇలా ప్రతిదీ ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లు ఫ్యాషన్‌ బ్రాండెడ్‌ సంస్థలు ప్రొడక్ట్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఫ్యాషన్‌ లగ్జరీ బ్రాండ్‌ గుచీ, స్పోర్ట్స్‌ బ్రాండ్‌ సంస్థ అడిడాస్‌లు సంయుక్తంగా ఓ గొడుగును మార్కెట్‌లో విడుదల చేశాయి. ఇప్పుడీ గొడుగు నెట్టింట్లో వైరల్‌గా మారింది.  

అడిడాస్‌ ఎక్స్‌ గూచీ కలెక్షన్‌ పేరుతో స్పెషల్‌గా తయారు చేసిన ఈ గొడుగును ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది.1,644 డాలర్లు(భారత కరెన్సీలో రూ1,27,407.12) చైనా గూచీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ గొడుగు స్పెషాలిటీ ఏంటో తెలుసా? వర్షం కురుస్తున్నప్పుడు తడవకుండా ఉండేందుకు గొడుగును వినియోగిస్తాం.కానీ ఈ ఫ్యాషన్‌ సంస్థలు అమ్మకానికి పెట్టిన ఈ గొడుగును వర్షంలో వినియోగించడానికి కాదంట. 

"దయచేసి గమనించండి, ఈ గొడుగు వర్షంలో తడవకుండా ఉండేందుకు కాదు. సూర్యుడి నుంచి రక్షణ లేదంటే అలంకరణ కోసమే ఉపయోగించుకోవచ్చని తెలిపింది. గొడుగు అమ్మకం గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో నెటిజట్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. వర్షంలో వినియోగించేందుకు పనిచేయని గొడుగును ఇంత ధరకు అమ్మడం ఏంటని మండి పడుతున్నారు. 

చదవండి👉‘35 వేలా? ఏముంది ఇందులో.. రూ.150కే దొరుకుతుంది’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top