‘35 వేలా? ఏముంది ఇందులో.. రూ.150కే దొరుకుతుంది’

Viral: Mom Says daughters Rs 35k Gucci Belt Looks Like A School Belt - Sakshi

న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్త్రధారణలో అనేకానేక మార్పులు వస్తున్నాయి. బ్రాండెడ్, లగ్జరీ దుస్తులు ధరించడం ఇప్పుడొక ఫ్యాషన్. ఈ ఫ్యాషన్‌ను ఫాలో కాకపోవడాన్ని నామూషీగా ఫీలయ్యే వారు ఎంతో మంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నా, నలుగురిలో తిరగాలంటే ఇలాంటివి ఉండాల్సిందే అనే ఆలోచనలు ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతుంటాయి. ఇక డబ్బులున్న వారీ సంగతీ మరింత భిన్నంగా ఉంటుంది. ఏం ధరించిన కాస్ట్‌లీదే అయ్యుండేలా చూసుకుంటారు. అయితే ప్రతీది లగ్జరీగా కనిపించదు. కొన్నింటి ఖరీదు నిజంగా నమ్మడానికి వింతగా అనిపిస్తుంటుంది. 

అచ్చం అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ అయిన చాబీ గుప్తా ఇటీవల ఆమె కొన్న ఓ బ్రాండెడ్‌ బెల్ట్‌ను తన తల్లికి చూపించింది.  అది  లగ్జరీ బ్రాండ్‌ గుచీకి చెందినది. దాని ఖరీదు అక్షరాలా 35 వేల రూపాయలు. అయితే ఆ నిజాన్ని తల్లి అనిత గుప్తా అస్సలు నమ్మలేదు. పైగా అది అచ్చం ఆమె చదువుకున్న రాంచీలోని డిల్లీ పబ్లిక్‌స్కూల్‌ బెల్ట్‌లా ఉందంటూ కూతురు గాలి తీసేసింది.  ముందుగా గుచీ బ్రాండ్‌ లోగో ఉన్న బాక్స్‌లో నుంచి బెల్ట్‌ తీస్తూ ‘ఇది ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బెల్ట్‌ ఆ? ఖరీదెంత అంటూ తల్లి అనితా ప్రశ్నించింది. ఇందుకు కూతురు 35 వేలు అని సమాధానమిచ్చింది.

‘35 వేల బెల్డ్‌ ఆ ఇది.. అంత ఏముంది ఇందులో.. అయినా ఎందుకు జీజీ అని దీని మీద రాశారు.. బయట నీకు ఇది ఎక్కడైన 150 రూపాయలకు దొరుకుతుంది. అంటూ పెదవి విరిశారు. తల్లి మాట్లాడుతుండగా చాబీ గట్టిగా నవ్వుకుంది. దీంతో ‘ మీరంతా కేవలం డబ్బు వృథా చేయడానికే ఉన్నారు. అంటూ అనితా మరోసారి కోపగించుకున్నారు. తల్లీకూతుళ్ల మధ్య జరిగిన ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు చాబీ.  ప్రస్తుతం ఇది నెట్టింటా చక్కర్లు కొడుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top