రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్‌ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు | Adani Ports Repays 500 Crore Debt | Sakshi
Sakshi News home page

రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్‌ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు

Feb 21 2023 7:34 AM | Updated on Feb 21 2023 7:35 AM

Adani Ports Repays 500 Crore Debt - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ తాజాగా రూ. 1,500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించింది. మరిన్ని రుణాల చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా మొత్తం ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌కు చేరగా.. మార్చిలో గడువు తీరనున్న మరో రూ. 1,000 కోట్ల కమర్షియల్‌ పేపర్స్‌కు సైతం చెల్లింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

నగదు బ్యాలన్స్‌ నుంచి ప్రీపేమెంట్‌ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.  కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు ఈ నెల 8న కంపెనీ స్పష్టం చేసింది. వచ్చే నెలలో 50 కోట్ల డాలర్ల బ్రిడ్జి రుణాన్ని సైతం తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement