అదానీ గ్రూప్‌ ఇబిటా రికార్డ్‌ | adani group record ebitda rs 94834 crore fy26 investment rs 153 lakh crore | Sakshi
Sakshi News home page

అదానీ గ్రూప్‌ ఇబిటా రికార్డ్‌

Jun 3 2026 6:22 PM | Updated on Jun 3 2026 6:47 PM

adani group record ebitda rs 94834 crore fy26 investment rs 153 lakh crore

2025–26లో రూ. 94,834 కోట్లు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం, డైవర్సిఫైడ్‌ గ్రూప్‌ అదానీ గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో రికార్డ్‌ నిర్వహణ లాభం(ఇబిటా) సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,834 కోట్లు(10 బిలియన్‌ డాలర్లు) ఆర్జించింది. ఇదేసమయంలో రూ. 1.53 లక్షల కోట్ల(16.1 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి వ్యయాలు చేపట్టింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా అత్యధిక పెట్టుబడులు వెచ్చించిన దేశీ కార్పొరేట్‌ గ్రూప్‌గా నిలిచింది.

దీంతో గ్రూప్‌ పోర్ట్‌ఫోలియో స్థూల ఆస్తుల విలువ రూ. 7.85 లక్షల కోట్ల(82.8 బిలియన్‌ డాలర్లు)కు చేరింది. పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్‌ బిజినెస్‌ తదితర కీలక మౌలిక సదుపాయాలపై వెచ్చించింది. అదానీ గ్రూప్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం కన్సాలిడేటెడ్‌ ఇబిటా వార్షికంగా 5.6 శాతం బలపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement