
ఆధార్‌కు (Aadhaar) సంబంధించి వివిధ సేవలకు వసూలు చేసే యూజర్ చార్జీలను ఆధార్ కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ పెంచింది. కొత్త ఆధార్ కార్డుల జారీ సేవలను ఉచితంగానే కొనసాగిస్తూనే... గతంలో ఆధార్ కార్డులు పొందిన వారు తమ చిరునామా మార్చుకోవడం, నిర్ణీత వయసు వారు వేలిముద్రలను అప్‌డేట్ చేసుకోవడం వంటి సేవలకు మాత్రం చార్జీలను పెంచింది.
ఏడేళ్ల నుంచి 17 ఏళ్ల పైబడి వయసు వారు తమ ఆధార్‌లో వేలి ముద్రలను అప్‌డేట్ చేసుకోవాలంటే రూ.100 వసూలు చేస్తుండగా, ఆ మొత్తం రూ.125కు పెంచింది. చిరునామా మార్చుకోవడానికి రూ.50 చొప్పున వసూలు చేస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.75కు పెంచింది.
అక్టోబరు 1 నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు యూఐడీఏఐ ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్ హిమాన్షు దేశవ్యాప్తంగా అన్ని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాలకు సమాచారం పంపారు.
ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్.. ఈజీగా చేసుకోండిలా..