99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే! | According Ti Jitin Prasada 99.2% Of Mobile Handsets Used In India Are Domestically Manufactured | Sakshi
Sakshi News home page

99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే!

Dec 22 2024 11:03 AM | Updated on Dec 22 2024 11:27 AM

99.2% of mobile handsets used in India are domestically manufactured

మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.2% దేశీయంగా తయారైనవేనని పేర్కొన్నారు. 2014లో భారత్‌లో విక్రయించిన మొబైల్ ఫోన్లలో 74 శాతం దిగుమతులపైనే ఆధారపడినట్లు చెప్పారు. గడిచిన పదేళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందినట్లు వివరించారు.

తయారీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) వంటి వివిధ కార్యక్రమాలు ఇందుకు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ రూ.1,90,366 కోట్లుగా ఉంటే అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. ఇది 17% కంటే ఎక్కువ సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను సూచిస్తుంది. దాంతో పదేళ్ల కాలంలో మొబైల్ ఫోన్ల ప్రధాన దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా దేశం ఎదిగిందన్నారు.

ఇదీ చదవండి: యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్‌ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!

ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని ప్రసాద పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం రూ.76,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో సెమీకండక్టర్, డిస్‌ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ​్‌ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement