ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పెట్టుబడులకు విఘాతం

30 Indian and foreign investors seek Prime Minister Narendra Modi urgent intervention - Sakshi

28 శాతం జీఎస్‌టీపై ప్రధానికి పరిశ్రమ లేఖ

న్యూఢిల్లీ: రియల్‌ మనీ ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్‌టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి.

అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్‌ ఫిఫ్టీన్‌ క్యాపిటల్, టైగర్‌ గ్లోబ ల్, డీఎస్‌టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌ మొదలైనవి ఉన్నాయి. జీఎస్‌టీ మండలి నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్‌పై మాత్రమే కాకుండా భారత్‌లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top