రూ.74.9 లక్షల కొత్త జర్మన్ బ్రాండ్ కారు ఇదే.. | 2024 BMW M340i Launched in India | Sakshi
Sakshi News home page

రూ.74.9 లక్షల కొత్త జర్మన్ బ్రాండ్ కారు ఇదే..

Nov 14 2024 6:23 PM | Updated on Nov 14 2024 6:35 PM

2024 BMW M340i Launched in India

బీఎండబ్ల్యూ ఇండియా '2024 ఎం340ఐ' పర్ఫామెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 74.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ సెడాన్ కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

2024 బీఎండబ్ల్యూ ఎం340ఐ 48వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్‌తో 374 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది మెర్సిడీ బెంజ్ ఏఎంజీ సీ 43, ఆడి ఎస్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త బీఎండబ్ల్యూ ఎం340ఐ సెడాన్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ రేస్ బ్లూ, ఫైర్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. డిజైన్, సేఫ్టీ పరంగా ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి అప్డేట్స్ లేదు.

Advertisement
 
Advertisement
Advertisement