సుజుకి హయబుసాకు రీకాల్: కారణం ఇదే.. | 1056 Suzuki Hayabusa Bikes Recall in India | Sakshi
Sakshi News home page

సుజుకి హయబుసాకు రీకాల్: కారణం ఇదే..

Oct 28 2024 2:34 PM | Updated on Oct 28 2024 2:49 PM

1056 Suzuki Hayabusa Bikes Recall in India

భారతదేశంలో సుజుకి మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా'కు రీకాల్ ప్రకటించింది. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైకుకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, సమస్యను పరిష్కరించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.

మూడవ తరం హయబుసాలలో బ్రేక్ సమస్య ఉన్నట్లు గుర్తించిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ స్వచ్ఛందంగానే రీకాల్ ప్రకటించింది. 2021 మార్చి - 2024 సెప్టెంబర్ మధ్య తయారైన సుమారు 1,056 బైకులలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. ఇది బైక్ రైడర్లను ప్రమాదంలోకి నెడుతుంది.

ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించిన పిర్యాదులు నమోదు కాలేదు. కానీ భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తుందని సమాచారం. దీనికోసం కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేయదు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.

Advertisement
 
Advertisement
Advertisement